ధర్మము అనేది దిగుమతి చేసుకుని తెచ్చి పెట్టుకునేది కానీ, సవాళ్లకు తగ్గి తలవంచేది కాదు. ధర్మానికి కట్టుబడి ఉన్న ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉండాలి. “ఎవరైనా ధర్మ మార్గం నుండి తప్పుకుంటున్నారు అంటే, వారు ఆధర్మం చేస్తున్నారని అర్థము” అని స్వామి వారు చెప్పారు. ఎల్లప్పుడూ ధార్మికంగా ఉండాలంటే భగవంతుని అంతర్వాణిని వినాలి. “ఆవాణి నిరంతరము తప్పు ఒప్పుల మధ్య విచక్షణ జ్ఞానాన్ని హెచ్చరిస్తూ వుంటుంది” అని స్వామి చెప్పారు.
ఒక వ్యక్తి తన జీవన భృత్తి కొరకు ధనాన్ని సంపాదించునపుడు, తన కర్తవ్యాలను, ప్రాపంచిక విధులను సక్రమంగా నిర్వర్తించునపుడు సరియైన ధర్మ మార్గాన్ని ఎన్నుకుని అనుసరించాలి.
“కోపం అనర్ధ హేతువు” అన్న కథ ధర్మాన్ని ఎలా ఆచరించాలి తెలుపుతుంది. ఎవరైనా (స్త్రీ లేదా పురుషుడు) ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ, శాంతిని పొందాలంటే తను చేసే ప్రతి పనీ ఎరుక కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలి.
“పనిలో ఎక్కువ తక్కువలు లేవు” అన్న కథలో పదవి అహంకారముతో ఉన్న కాప్టెన్ కి దయార్థ హృదయుడైన జార్జ్ వాషింగ్టన్ చక్కటి గుణపాఠాన్ని నేర్పాడు.
అదేవిధంగా “ఆచరణ లేని ప్రచారం వ్యర్థము” అనే కథలో శ్రీ రామకృష్ణ పరమహంస వారు ‘ఏదైనా తాను ఆచరిస్తేనే ఇతరులకు చెప్పటానికి అర్హత కలిగి ఉంటాము” అన్న విషయాన్ని తెల్పటం ద్వారా సమైక్యత (శాంతి), నాయకత్వ లక్షణాలను (ధర్మం) చాటి చెప్తున్నారు.
అదేవిధంగా స్వామి వివేకానంద జీవితం లోని రెండు వేర్వేరు సంఘటనలు ఏకాగ్రత విలువలను(శాంతి), నాయకత్వ లక్షణాలను (ధర్మం) వివరిస్తున్నాయి.