వేదానుద్ధరతే
ఆడియో
శ్లోకము
- వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళం ఉద్బిభ్రతే
- దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే
- పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
- మ్లేఛ్ఛా న్మూర్ఛయతే దశా కృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః
అర్ధము
మత్స్య రూపుడవై వేదములనుధ్ధరించి, కూర్మ రూపధారుడవై పర్వతమును భరించి, వరాహ రూపుడవై భూమిని వహించి, నరశింహ రూపుడవై హిరణ్య కశిపుని సంహరించి, వామనుడవై బలి మదమణచి, పరశురాముడవై క్షత్రియుల అహంకారమును ద్రుంచి, రాముడవై రావణుని హతమార్చి, బలరాముడవై హలమును ధరించి, కరుణాసముద్రుడవై కృష్ణావతారమును ధరించి, కలివై దుష్టుల సంహరించు ఓ దేవా! నీ చరణ కమలముల నాశ్రయించితిని.
వీడియో
వివరణ
వేదానుద్ధరతే శ్లోకము | వివరణ |
---|---|
వేదాన్ | వేదములను |
ఉద్ధరతే | కాపాడినవాడు |
జగన్నివహతే | ఈ ప్రపంచమును కాపాడిన వాడు |
భూగోళం | భూమిని |
ఉద్బిభ్రతే | సముద్రము నుంచి పైకి తెచ్చి రక్షించిన వాడు |
దైత్యం | కశ్యపముని భార్య దితి కి జన్మించిన పుత్రులు / రాక్షసులు / దైత్యులు |
దారయతే | సంహరించినవాడు |
బలిం | బలి చక్రవర్తి అను రాక్షస రాజును |
ఛలయతే | మాయచేసినవాడు |
క్షత్రక్షయం | క్షత్రియుల సంహారము |
కుర్వతే | చేసినవాడు |
పౌలస్త్యం | పౌలస్త్యం అను వంశంలో పుట్టిన వాడు, రావణాసురుడు |
జయతే | విజయం సాధించిన వాడు |
హలం | నాగలి |
కలయతే | మోయువాడు |
కారుణ్యమాతన్వతే | దయకలిగినవాడు |
మ్లేఛ్ఛాన్ | చెడ్డబుద్ధి కల మానవులను |
మూర్ఛయతే | స్పృహ కోల్పోవునట్లు చేసినవాడు |
దశాకృతి కృతే | దశావతారములు ఎత్తిన వాడు |
కృష్ణాయ | కృష్ణా |
తుభ్యం | నీకే |
నమః | నమస్కరించుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి