హారతి
ఆడియో
సాహిత్యం
- ఓం ఙై జగదీశ హరే
- స్వామి సత్యసాయి హరే
- భక్తజన సంరక్షక
- భక్తజన సంరక్షక – పర్తిమహేశ్వరా
- ఓం జై జగదీశ హరే
- శశివదనా శ్రీకరా సర్వ ప్రాణపతే
- స్వామి సర్వ ప్రాణపతే
- ఆశ్రితకల్పలతీకా ఆశ్రితకల్పలతీకా
- ఆపద్బాంధవా
- ఓం ఙై జగదీశ హరే
- మాత పితా గురు దైవము
- మరి అంతయు నీవే
- స్వామి మరి అంతయు నీవే
- నాదబ్రహ్మ జగన్నాధ నాదబ్రహ్మ జగన్నాధ
- నాగేంద్రాశయనా
- ఓం ఙై జగదీశ హరే
- ఓంకార రూప ఓజస్వి
- ఓ సాయి మహాదేవా
- సత్యసాయి మహాదేవా
- మంగళ హారతి అందుకో
- మంగళ హారతి అందుకో
- మందర గిరిధారీ
- ఓం ఙై జగదీశ హరే
- నారాయణ నారాయణ ఓం
- సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం
- నారాయణ నారాయణ ఓం
- సత్యనారాయణ నారాయణ ఓం
- సత్యనారాయణ నారాయణ ఓం
- ఓం జై సద్గురు దేవా
- ఓం శాంతిః శాంతిః శాంతిః
అర్థము
- సమస్త విశ్వానికి ప్రభువు, సమస్త జనుల అజ్ఞాన అహంకారములను నివారించు వాడు, భక్తులను దయతో రక్షించి, మంచి మార్గమును చూపువాడు, సాకారుడై పుట్టపర్తిలో అవతరించిన శ్రీసత్యసాయి ప్రభువుకు జయము.
- చంద్రుని వలే మనోహరమైన ముఖం కలవాడు, సర్వ జీవులకు పతియై, ఆనందమును, శుభమును కలుగ జేయువాడు, శరణుజొచ్చిన వారికి కల్పవృక్షం వంటివాడు, ఆపదలలో, కష్టాలలో వున్న వారికి బంధువు, స్నేహితుడు, రక్షకుడు అయిన శ్రీ సత్యసాయి ప్రభువుకు జయము.
- ఓ! సత్యసాయి ప్రభూ! నీవే మాకు తల్లివి, తండ్రివి, గురువువు, దైవము. మా సర్వస్వము నీవే. శబ్దబ్రహ్మము, శేషతల్పశాయివి యైన జగన్నాథా నీకు జయము.
- ఓంకార స్వరూపుడవు, శక్తిమంతుడవు, మందర గిరిధారీ! సత్యసాయి
మహాదేవా! మంగళ హారతి అందుకొనుము. - సద్గురు శ్రీ సత్యసాయి నారాయణుని నామము స్తుతించెదముగాక! సద్గురు దేవుడయిన శ్రీసత్యసాయి దేవునకు జయము. జయము.
వివరణ
ఓం | ప్రణవము ఆది శబ్దము |
---|---|
ఙై | జయము |
జగదీశ | సమస్త విశ్వానికి ప్రభువైన |
హరే | హరించువాడు అనగా మన అజ్ఞానమును, అహంకారమును హరించువాడు. |
స్వామి | గురువు, దైవము |
సత్య సాయి | సత్యమునకే అధిపతి అయినటువంటి వాడు |
భక్తజన | భక్తజనులకు |
సంరక్షక | దయతో రక్షించి, మంచి మార్గమును చూపువాడు |
పర్తిమహేశ్వరా | సాకారుడై పుట్టపర్తిలో అవతరించిన నిరాకారుడు |
శశివదనా | చంద్రుని వలె మనోహరమైన ముఖము కలిగినటువంటి వాడు |
శ్రీకరా | అన్ని విధముల ఆనందమును, శుభమును కలుగజేయువాడు |
సర్వ ప్రాణపతే | సమస్త ప్రాణులకు పతి లేదా యజమాని అయినటువంటివాడు |
ఆశ్రిత కల్పలతీకా | శరణుజొచ్చిన వారికి కల్పవృక్షము వంటి వాడు |
ఆపద్భాంధవా | ఆపదలలో, కష్టాలలో ఉన్నవారికి ఆయన బంధువు, స్నేహితుడు, రక్షకుడు |
మాత పితా | తల్లి, తండ్రి |
గురు, దైవము | గురువు, దైవము |
మరి అంతయు నీవే | మరియు సర్వస్వము నీవే. అనగా తల్లి, తండ్రి, గురువు, దైవము సర్వస్వము స్వామే. |
నాదబ్రహ్మ | సృష్టికి పూర్వము ఈ విశ్వమంతా వ్యాపించిన ప్రణవము. శబ్ద స్వరూపము. |
జగన్నాధ | జగత్తుకి ప్రభువు అయినటువంటి వాడు. |
నాగేంద్రాశయనా | పాముపై విశ్రమించు వాడు. శేషతల్పశాయి |
ఓంకార రూప | ఓంకార స్వరూపుడు. ప్రణవ స్వరూపుడు. |
ఓజస్వి | శక్తిమంతుడు |
ఓ సాయి మహాదేవా | ఓ సత్యసాయి మహాదేవా |
మంగళ హారతి | భగవంతుని ముందు సమర్పించు కళ్యాణ ప్రదమైన హారతి |
అందుకో | తీసుకో, గైకొనుము. |
మంథర గిరిధారీ | క్షీరసాగర మధనము జరుగునపుడు మందర పర్వతమును తన వీపుపై మోసినవాడు. |
నారాయణ | నారములు అనగా నరుల సమూహము. నరుల సమూహము నందు ఉండువాడు. అనగా లోపల-బయట-అంతటా వ్యాపించి ఉండి పరబ్రహ్మము. |
సద్గురు దేవా | గురువులలో శ్రేష్టుడు. (అజ్ఞానాంధకారమును తొలగింప చేయువాడు) |
శాంతిః | శాంతి |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి