అష్టోత్రం [55-108]
వివరణ
ఆడియో
సాహిత్యం
- ఓం శ్రీ సాయి అనంత నుత కర్తృణే నమః
అనంతముగా స్తుతింపబడుతూ, సమస్తమునకు కర్తయైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమః
పురాణపురుషుడు, ఆదిదేవుడయిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః
ఆదిశక్తి స్వరూపమైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః
సాటిలేని శక్తులుకల శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః
నిరాకారుడయిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి కామ క్రోధ ధ్వంసినే నమః
కోరికలను, క్రోధమును నాశనము చేయు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి కనకాంబర ధారిణే నమః
బంగారు రంగు వస్త్రములను ధరించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి అద్భుత చర్యాయ నమః
ఆశ్చర్యము కలిగించు చర్యల నొనరించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ఆపద్భాంధ వాయ నమః
ఆపదలలో ఉన్నవారికి బంధువువలే సహాయపడు శ్రీస్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః
ప్రేమయే ఆత్మగా కల శ్రీ స్వామికి నమస్కారము .
- ఓం శ్రీ సాయి ప్రేమ మూర్తయే నమః
ప్రేమమూర్తి అయిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమః
ప్రేమను ప్రసాదించు శ్రీస్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ప్రియాయ నమః
అందరి చేత ప్రేమించబడు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః
భక్తులందరికీ ప్రియమైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్త మందారాయ నమః
భక్తుల కోరికలను తీర్చు కల్పవృక్షమైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్త జన హృదయ విహారాయ నమః
భక్తుల హృదయములలో ఆనందముతో విహరించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః
భక్తుల హృదయములను ఆలయములుగా చేసుకున్న శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః
భక్తులకు వశమైవుండే శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్తిజ్ఞాన ప్రదీపాయ నమః
భక్తుల హృదయములలో భక్తి, జ్ఞానములను ప్రకాశింపచేయు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భక్తిజ్ఞాన ప్రదాయ నమః
భక్తి జ్ఞానములను ప్రసాదించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః
చక్కని జ్ఞాన మార్గమును చూపించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి జ్ఞాన స్వరూపాయ నమః
జ్ఞానమే స్వరూపంగా కల శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః
గీతాచార్యుడైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమః
జ్ఞాన సిద్ధిని అనుగ్రహించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః
సుందర రూపముగల శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి పుణ్య పురుషాయ నమః
పరమపావన పుణ్యపురుషుడైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమః
సత్కర్మలకు ఫలమునిచ్చు శ్రీ స్వామికి నమస్కారము..
- ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః
పురుషులలో ఉత్తముడు అయిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః
సనాతనుడు, పురాణ పురుషుడయిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి అతీతాయ నమః
మానవుల బుద్ధికి అందని అతీతమైన శక్తికల శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః
త్రికాలములకు అతీతుడయిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమః
సిద్ధి రూపుడైన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః
సంకల్పమాత్రము చేత సిద్ధిని ప్రసాదించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ ఆరోగ్య ప్రదాయ నమః
ఆరోగ్యమును అనుగ్రహించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయినే నమః
అన్నవస్త్రములను ప్రసాదించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః
సంసార దుఃఖములను తొలగింపచేయు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః
భక్తుల అభీష్టములను నెరవేర్చు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి కల్యాణ గుణాయ నమః
శుభప్రదమైన గుణములుకల శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి కర్మ ధ్వంసినే నమః
కర్మను నశింపచేయు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సాధుమానస శోభితాయ నమః
సాధు పురుషుల మనస్సులందు శోభిల్లు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః
సర్వమతములు సమ్మతించు శ్రీ స్వామికి నమస్కారము .
- ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః
సాధు పురుషుల మనస్సులను పరిసోధించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సాధకాను గ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః
సాధకులను అనుగ్రహించుటకై వట వృక్షమును ప్రతిష్టించిన శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ నమః
అన్ని రకముల సంశయములను తొలగింపచేయు శ్రీ స్వామి కి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః
సమస్త జ్ఞాన సారమును అందించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమః
యోగులందరికీ ప్రభువైన శ్రీస్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి యోగీంద్ర వందితాయ నమః
యోగీంద్రులచే సమస్కరింపబడు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః
సమస్త శుభములను, అనుగ్రహించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సర్వసిద్ధి ప్రదాయ నమఃనమః
సర్వ సిద్ధులను అనుగ్రహించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి ఆపన్ని వారిణే నమః
ఆపదల నుండి రక్షించు శ్రీ స్వామికి నమస్కారము
- ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః
శారీరక, మానసిక బాధలను తొలగించు శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః
శాంతమే రూపముగా గల శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమః
సులభముగా ప్రసన్నమయ్యే శ్రీ స్వామికి నమస్కారము.
- ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయిబాబాయ నమః
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అయిన భగవాన్ సాయికి నమస్కారములు.
భగవాన్ : – ఈ 6 లక్షణములు కలిగినటువంటి వానిని భగవాన్ అందురు.
- ఐశ్వర్యము – సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు.
- ధర్మ – సత్కర్మ.
- యశస్- కీర్తి
- శ్రీ – సంపద
- జ్ఞానము- – విజ్ఞానము
- వైరాగ్యము- – మమకారము లేకుండుట
ప్రతి జీవి యొక్క మూలం మరియు పరిపూర్ణత వాటి రాకపోకలు తెలిసిన వ్యక్తి యొక్క 108 శ్రేష్ట రత్నములతో కూర్చిన దివ్య హారమే అష్టోత్తర శత నామము.
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 8