ధర్మము క్షీణించినప్పుడు మానవాళిని ఉద్ధరించుట కై భగవంతుడు ఈ భువిపై అవతరిస్తాడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఈ విధంగా భగవంతుడు కలియుగంలో 1926 నవంబర్ 23వ తేదీన శ్రీ సత్యసాయి బాబాగా అవతరించారు. భగవాన్ బాబా వారు జాన్.ఎస్. ఇస్లాప్ తో “తన అవతారంలో మొదటి 16 సంవత్సరములు దివ్యలీలలతోను, 16 నుండి 45వ సంవత్సరాల వరకు ఆధ్యాత్మిక బోధనలతోను కూడియుండి, యావత్ ప్రపంచాన్ని సత్య,ధర్మ,శాంతి, ప్రేమ మరియు అహింసా మార్గాల్లో నడిపిస్తాయి” అని తెలిపారు.
తర్వాత అధ్యాయం సత్యసాయి బాబా వారి బాల్యము మరియు బాల్యంలో ఆయన చేసిన లీలలను గురించి తెలియజేస్తుంది. నా మహిమలే నా విజిటింగ్ కార్డులుగా ఉంటూ సుదూర ప్రాంతాల ప్రజలను నా వద్దకు రప్పిస్తాయి అన్నారు బాబా.
బాలవికాస్ పిల్లలకు తెలియజేసే శ్రీ సత్య సాయిబాబా వారి బాల్య గాథలు, బాల్యంలో స్వామివారు తన కుటుంబంతోను, స్నేహితులతోను ఆచరించిన చూపిన విలువలు, వారిపై ప్రకటించిన ప్రేమ, మరియు వారి దివ్యత్వ లీలలు బాలవికాస్ చిన్నారుల దైనందిన జీవితంలో అంతర్ దృష్టిని పెంపొందిస్తాయి.
బాలవికాస్ గురువులు విద్యార్థుల యొక్క అవగాహనను అంచనా వేయటానికి ఇందులో క్విజ్ ప్రశ్నలను తయారు చేసుకొనవచ్చు.