సత్సంగత్వే నిస్సంగత్వం
ఆడియో
సాహిత్యం
- సత్సంగత్వే నిస్సంగత్వం,
- నిస్సంగత్వే నిర్మోహత్వం |
- నిర్మోహత్వే నిశ్చలతత్వం
- నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
భావము :
ప్రతి సాధకునికీ సత్సంగం అత్యవసరం. సత్సంగత్వం వలన విషయాసక్తి దూరం అవుతుంది. విషయాసక్తినుండి స్వేచ్ఛ పొందిన వ్యక్తి సహజంగానే నిర్మోహిగా అవుతాడు. నిర్మోహి అయిన మానవుడు కష్టసుఖాలనే ద్వంద్వాల వలన కలత చెందక, నిశ్చలంగా కష్ట సుఖాల రెండింటిపట్ల సమబుద్ధి కలిగి వుంటాడు. ఇట్టి నిశ్చిత స్థితినే మనము జీవన్ముక్తి అంటున్నాము.
వివరణ
సత్సంగత్వే | సత్పురుషుల సాంగత్యము వలన |
---|---|
నిస్సంగత్వం | సంగగత్వం లేకుండుట వలన |
నిస్సంగత్వే | అసంగత్వము కలిగి యుండడము ద్వారా |
నిర్మోహత్వం | మోహము తొలగును |
నిర్మోహత్వే | మోహము తొలగిపోవడము వలన |
నిశ్చల | స్థిరముగా ఉండే |
తత్త్వం | సదృష్టి ఏర్పడుతుంది |
నిశ్చలతత్వే | స్థిరమైన దృష్టి వలన |
జీవన్ | భవబంధమునుండి |
ముక్తిః | విముక్తి కలుగును |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty