మన ఆలోచనలు, పలుకులు
మన ఆలోచనలు, పలుకులు- కర్తవ్యములు అనే నదిలో, లెక్కకు అందని నీటి బిందువుల వలె, అనంతముగా ఉంటాయి. ఈ నదిపై పట్టు మనకు కొంత మాత్రముగా ఉంటుంది. ఆ నదీ ప్రవాహము ఎంత శక్తివంతముగా ఉంటుంది అంటే, తన మార్గమధ్యంలో వచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను సహితము తప్పిస్తుంది/ తొలగిస్తుంది. కానీ అదే నదిని, దాని జన్మస్థానము దగ్గర చిన్న రాయితో, ఆ ప్రవాహమును కట్టడి చేయవచ్చు. అదియే మౌనముగా ఉండుట/ మౌన ధారణ మహిమ. అందుకే భగవాన్ బాబా వారు చెప్పారు, “వ్యాకులముతో, అలజడితో నిండిన హృదయమును స్వాంతన పరచుటకు, నెమ్మది చేయుటకు నిశ్శబ్దమును మించినటువంటిది మరొకటి లేదు”.
12 సంవత్సరముల లోపు విద్యార్థులకు నిశ్శబ్దంగా ఉండుటకు/ మౌనమును అలవరచుకొనుటకు “మార్గదర్శక దృశ్యనీయత” ఒక ప్రభావాన్వితమైన పద్ధతి. ఊహా సన్నివేశములోనికి విద్యార్థులను ప్రవేశ పెట్టుటకు ఇది ఒక మిక్కిలి ప్రయోజకరమైనటువంటి సాధనము. ప్రకృతికి సంబంధించిన విషయమునైనా ఊహా సన్నివేశమునకు పరిగణించవచ్చు.