పృథ్వి అంతా ప్రశాంతముగా ఉన్నది. ఆ ప్రశాంతత నా దగ్గర నుండి ప్రారంభమైనది.
జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందం కోసం తాపత్రయపడతారు, అది ఒక పిల్లవాని విషయములో ఐస్ క్రీమ్ కొరకు కావచ్చు, ఒక వయస్సు మళ్లిన వ్యక్తి ప్రశాంత జీవితము కొరకు కావచ్చు లేదా ఒక యువకుడు సంపన్నుడిగా కావాలనే కోరిక కావచ్చు.
సమస్య ఏమిటంటే, చాలా సందర్భాలలో, కోరిక తీరగానే మన ఆనందం స్వల్పకాలికంగా ఉంటుంది . అసంతృప్తి మొదలు మరోసారి చిగుర్చుతుంది మరియు మనకు నిజంగా సంతోషాన్ని కలిగించే దాని గురించి మనం కలలు కనడం ప్రారంభిస్తాము.
ఈ లోకంలో ఉన్నటువంటి విపరీతము ఏమిటీ అంటే మానవునికి బాహ్యముగా అంతరిక్షములోనికైనను పోవుటకు సాహసించును కానీ, దృష్టిని అంతర్ముఖము చేసి తన లోనికి ప్రవేశించుట అసాధ్యముగా కానవస్తున్నది. అయినప్పటికీ మనం మన పిల్లలకు మరియు మనకు ఇవ్వగల అత్యంత విలువైన బహుమతి సంతృప్తి మరియు మనశ్శాంతిని పొందగల సామర్థ్యం.
“గైడెడ్ విజువలైజేషన్” 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ అంతర్గత ప్రయాణము సంతృప్తి మరియు మనశ్శాంతిని కనుగొనుటలో అత్యంత ప్రభావము చూపుతుంది. సెషన్ ఏదైనా విలువ ఆధారిత థీమ్లపై ఉంటుంది. ఈ సమావేశములలోని అంశములకై విలువలతో కూడిన ఏ విషయములైనా ఎంచుకొనవచ్చును.