రామాయణంలోని శ్రీరాముని కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు లందరికీ నేటికీ సందర్భోచితంగా మార్గదర్శకంగా ఉంది. రామాయణం కర్తవ్యం, సత్యం, భక్తి, విశ్వాసం, సత్ప్రవర్తన మరియు శరణాగతి వంటి పవిత్రమైన ఆదర్శాలపై నిలిచి ఉంది. ఈ ఇతిహాసం తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి యుండటం, క్రమశిక్షణ పాటించటం, ధర్మాన్ని ఆచరించడం వంటి ఉన్నతమైన వ్యక్తిగత ఆదర్శాలను చాటి చెప్తుంది. ఎవరికి వారు ధర్మానికి (కర్తవ్యానికి) నిరంతరం కట్టుబడి ఉండాలి. వారి జీవితాల్లో విలువలను పెంపొందించుకోవాలి మరియు ఆనందాన్ని పొందాలి ఆన్నదే ఈ బోధనలన్నిటి సారాంశము.
“భగవంతుడు నడిచిన మార్గంలో మానవుడు ఆదర్శవంతమైన వ్యక్తిగా తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో చూపిన బాటయే శ్రీ రామాయణము” అని స్వామి చెప్పారు. ఈ కలియుగంలో రామ నామస్మరణయే ఈ జీవన విముక్తికి మార్గమని నొక్కి చెప్పారు (దివ్య ప్రసంగం, రామ నవమి, 30 మార్చి 2004).
గ్రూప్ 2 విద్యార్థులు క్లాస్లో కథను చదవగలరు మరియు వారు నిత్యజీవితంలో నిర్వర్తించిన ఉన్నతమైన నైతిక విలువలను వివరించవచ్చు. రామాయణంలోని కొన్ని సవివరమైన మరియు తెలియని వాస్తవాల సంకలనమే స్వామివారు రచించిన రామకథా రసవాహిని.











![అష్టోత్రం [55-108]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)








