శ్రీ సత్య సాయి అష్టోత్రం[1-27]
వివరణ
ఆడియో
LYRICS
- ఓం శ్రీ భగవాన్ సత్య సాయి బాబాయ నమః
మనందరికీ దివ్యమాత, పిత అయిన బాబాకు నమస్కరిస్తున్నాము
ఓం : ఆది శబ్దము సర్వత్రా వ్యాపించినటువంటిది (యోగములో మానవుని వెన్నెముక కేంద్రభాగము). ఆ పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన సంకేతము ఓంకారము. అట్లే బాబాకు గూడా అదే సంకేతము.
శ్రీ : అన్ని రకములైన ఐశ్వర్యము.
నమః : చేతులు జోడించి శిరస్సువంచుట, 10 వ్రేళ్ళు కలిపినప్పుడు కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములు భగవంతుడికి అర్పించుట. నమః కు బాబా చెప్నినది, ఇంద్రియములు మనసుతో కలిపి భగవంతుని కర్పించుట. నామమ = నాది కాదు, మీది అనెడి శరణాగతిని తెల్పు క్రియ నమస్కారము.
- ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః
సత్యమే స్వరూపముగా కలవాడు.
- ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః
సత్య, ధర్మములు నెలకొల్పుట యందు అచంచల దీక్ష కలవాడు.
- ఓం శ్రీ సాయి వరదాయ నమః
వరములను యిచ్చువాడు, వరప్రదాత.
- ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః
నిత్యుడై వెలుగొందు సత్ పురుషుడు.
- ఓం శ్రీ సాయి సత్య గుణాత్మనే నమః
సద్గుణములు, సత్సీలము కలిగియుండువాడు.
- ఓం శ్రీ సాయి సాధు వర్ధనాయ నమః
సద్గుణములను పెంపొందించు వాడు.
- ఓం శ్రీ సాయి సాధు జన పోషణాయ నమః
సజ్జనులను సంరక్షించువాడు.
- ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమః
అన్నిటినీ తెలిసినవాడు.
- ఓం శ్రీ సాయి సర్వజన ప్రియాయ నమః
సర్వులకు (అందరికీ) ప్రియమైనవాడు.
- ఓం శ్రీ సాయి సర్వశక్తి మూర్తయే నమః
సర్వ శక్తులకు నిలయమైనటువంటివాడు.
- ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః
అందరికీ ప్రభువయినటు వంటివాడు.
- ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః
అన్ని బంధములు వదిలినవాడు (విరాగి).
- ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః
సర్వజీవుల హృదయములందు ఉండువాడు.
- ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః
మహిమలు గలవాడు (దివ్యాత్మ).
- ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః
శివ స్వరూపుడు.
- ఓం శ్రీ సాయి పర్తిగ్రామోద్భవాయ నమః
పర్తి అను గ్రామమున జన్మించినవాడు.
- ఓం శ్రీ సాయి పర్తి క్షేత్ర నివాసినే నమః
పర్తి క్షేత్రములో నివసించువాడు.
- ఓం శ్రీ సాయి యశకాయ షిర్డీ వాసినే నమః
పూర్వశరీరములో షిర్డీ నివాసిగా కీర్తి పొందినాడు.
- ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః
ఒక భక్తుని బిడ్డను రక్షించి లీలలో ఈ పేరు ధరించెను.
- ఓం శ్రీ సాయి భారద్వాజ ఋషి గోత్ర్రాయ నమః
భారద్వాజ ఋషి గోత్రము నందు జన్మించినవాడు.
- ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః
భక్తుల యందు వాత్సల్యము, ప్రేమ కలిగినవాడు.
- ఓం శ్రీ సాయి అపాంత రాత్మనే నమః
సంసార సముద్రము దాటి మనల దాటించువాడు, అందరి యందు వుండును.
- ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః
అవతారములకు మూర్తియైనవాడు.
- ఓం శ్రీ సాయి సర్వభయ నివారిణే నమః
అన్నివిధములైన భయములను తొలగించువాడు.
- ఓం శ్రీ సాయి ఆపస్తంబ సూత్రాయ నమః
ఆపస్తంబ సూత్రకారుని సంప్రదాయములో జన్మించినవాడు.
- ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః
శరణు కోరిన వారికి అభయమిచ్చువాడు, రక్షించువాడు.
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 8