ప్రతి వ్యక్తికి తన హృదయనివాసి అయిన భగవంతుని నుండి సరియైన సమయంలో పిలుపు అందుతుందని స్వామి చెప్పారు. ధ్యానం కోసం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఇష్టదైవం యొక్క రూపాన్ని ఎదుట నిలుపుకొని, నామాన్ని ధ్యానించుకోండి. ఈ రెండిటిని మార్చకండి. మీకు ఇష్టమైన రూపనామాలకి కట్టుబడి ఉండండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ధ్యాస మరలి, వేరే దారిలో పరుగెడుతుంది.అప్పుడు భగవంతుడి రూప నామాలతో మనసును ఆధీనంలో వుంచండి. భగవంతుని ధ్యానిస్తున్న మీ ఆలోచన ప్రవాహానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.మరల అంతరాయం కలిగినచో, తిరిగి వెంటనే రూప నామాల ఆసరాతో ధ్యాస భగవంతునిపై మరల్చండి.
కొత్తగా ధ్యానం చేయువారిని ముందుగా భగవంతుని మహిమాన్వితమైన శ్లోకాలను. పఠించమని చెప్తారు. దానివల్ల ఆలోచనలు నియంత్రించబడతాయి. తర్వాత క్రమంగా ఈ జపాన్ని నియమానుసారంగా చేస్తూ , మనో నేత్రం ద్వారా మనం జపిస్తున్న రూపం సాక్షాత్కారం చేసుకోవాలి.