సత్యము కార్యాచరణ గావించినప్పుడు, అది ధర్మంగా రూపొందుతుంది. సత్యము త్రికరణశుద్ధిగా పలుకుటయే ధర్మాచరణ. అందుకే వేదములు “సత్యం వధ-ధర్మం చర” అని బోధించాయి. సత్యవాక్ పరిపాలన అభ్యాసనయే పరమోత్కృష్ఠ ధర్మము. అందువలన ప్రతి మనిషి తమకు తామే ధర్మాచరణకు అంకితం కావలెను.
చిన్న వయసు నుండే నిజాయితీ, సత్ప్రవర్తన అలవడుట వలన, వ్యక్తి వికాసము చెందుటయే కాక, యావత్ దేశం మొత్తం ప్రగతిపథంలో నడుస్తుంది.
“హృదయంలో ధర్మచింతన ఉంటే, శీలం లో సౌందర్యం ఉట్టిపడుతుంది. శీలం లో సౌందర్యం ప్రతిపాదిస్తే గృహంలో సామరస్యం ఉంటుంది. గృహంలో సామరస్యం ఉంటే, దేశంలో క్రమశిక్షణ
నెలకొంటుంది. దేశంలో క్రమశిక్షణ ఉంటే ప్రపంచ శాంతి నెలకొంటుంది.
ఈవిభాగంలో పొందుపరచిన కథలు – 1. మహనీయుల బోధనలు. 2. నిరాడంబరులైన మానవతా మూర్తులు, 3. గర్వమును అణచుటకు పాఠ్యాంశములు.