అహం వైశ్వా నరో
ఆడియో
శ్లోకం
- అహం వైశ్వా నరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
- ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||
భావము
నేను “వైశ్వానరుడను” జఠరాగ్నినై, ప్రాణుల యొక్క శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ అపాన వాయువులతో కూడుకునియున్న నాలుగు విధములైన అహారమును పచనము చేయుచున్నాను.
భగవానుడు జఠరాగ్నిగా జీవుల శరీరంలో నిలిచి, ప్రాణ మరియు అపాన (అంతర్గత మరియు బాహ్య శ్వాస) వాయువులతో కూడుకొని నాలుగు రకములయిన ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు.
నాలుగు విధములైన ఆహారములు ఏవనగా:-
- మనం దంతములచే కొరికి తినబడు పదార్థములు
- నాలుకచే చప్పరించి మ్రింగునవి
- నాలుకచే రుచి చూడబడినవి.
- నోటిచే జుర్రబడునవి.
వివరణ
అహం | నేను |
---|---|
వైశ్వానర: | వైశ్వానరుడనే జఠరాగ్నిగా |
భూత్వా | అయి |
ప్రాణినాం | ప్రాణుల యొక్క |
దేహమ్ | శరీరమును |
ఆశ్రితః | ఆశ్రయించినవాడనై |
ప్రాణాపాన | ప్రాణ, అపాన వాయువులతో |
సమాయుక్తః | కూడుకొనియున్న |
సమాయుక్తః | కూడుకొనియున్న |
చతుర్విధం | నాలుగు విధములగు |
అన్నమ్ | అన్నమును |
పచామి | పచనము చేయుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి