అల్లా తుమ్ హో
ఆడియో
సాహిత్యం
- అల్లా తుమ్ హో ఈశ్వర్ తుమ్ హో
- తుమ్హీ హొ రామ్ రహీమ్
- తుమ్హీ హొ రామ్ రహీమ్
- ఏసు తుమ్ హో నానక్ తుమ్ హో
- జోరాష్ట్ర భి హో మహావీర్ తుమ్ హో
- గౌతమ బుద్ధ కరీమ్
- మేరే రామ్ మేరే రామ్ రామ రహీమ్
భావము
ముస్లింలు ఆరాధించే, పరమ దయాళువు, నిరాకారతత్వము అయిన అల్లా, విశ్వ విరాట్ స్వరూపమైన ఈశ్వరుడు, అందరికీ ఆనందం కలిగించే శ్రీరాముడు, క్రైస్తవులు ఆరాధించే ఏసు, సిక్కులు ఆరాధించే నానక్, అహింసకు ప్రతీక అయిన మహావీరుడు, కరుణకు ప్రతీక అయిన బుద్ధుడు ఇలా అన్ని మతముల వారు ఆరాధించే దివ్యత్వం ఒక్కటే. రూప నామములు వేరైనా భగవంతుడు ఒక్కడే అని తెలియజేయు భజన. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అనగా “ఒకడే అయిన భగవంతుడు అనేక నామములతో పిలువబడుతాడు”. నామములు వేరైనా నామి ఒక్కడే అని తెలియచేస్తుంది ఈ భజన.
వివరణ
అల్లా | ముస్లిములు ఆరాధించే నిరాకార తత్వము అ-అనగా ఆత్మ, ల్లా – అనగా లయము |
---|---|
తుమ్ హో | నీవే |
ఈశ్వర్ | నిరాకార, నిర్గుణణ పరబ్రహ్మము. |
రామ్ | రాముడు, ప్రియమును కలిగించు వాడు |
రహీమ్ | పరమ దయాళుడుడు. అల్లాను రహీం అని కీర్తిస్తారు. |
ఏసు | యే అనగా ఒకటే, సు – అనగా దివ్యత్వము. యేసు అనగా దివ్యత్వం ఒకటే అని అర్థం. |
నానక్ | సర్వశక్తిమంతుడు అని అర్ధము. సిక్కుల గురువు. |
జోరాష్ట్ర | జోరాష్ట్ర మత గురువు. (మానవ హృదయాలలోని చీకటిని తొలగించుటకు వెలసిన బంగారు రంగులో మెరిసిపోయే నక్షత్రము అని అర్థం) |
మహావీర్ | ఇంద్రియముల విజయ సిద్ధిని పొందినవాడు. అహింసకు ప్రతీక. జైనుల గురువు. |
గౌతమ బుద్ధ | ఆత్మసాక్షాత్కారం పొందిన వాడు. తనను తాను తెలుసుకున్న వాడు. |
కరీమ్ | ఉదారుడు. |
మేరే | నా యొక్క |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty