అంతాక్షరి అనేది సంగీత పాటలతో కూడిన ఆట. భారతదేశంలోని సామాజిక సమావేశాలలో అన్ని వయస్సుల వారు కలిసి గడపే సమయంలో ఆడే ఆట. అంతాక్షరిలో, ముందు జట్టు ఎంపిక చేసి పాడిన పాట ముగిసే హల్లుతో (అక్షరంతో) తర్వాతి జట్టు పాడే పాట ప్రారంభమగును.
సాయి భజన అంతాక్షరి అనేది ప్రసిద్ధమైన అంతాక్షరి ఆట నుండి స్వీకరించబడిన ఆధ్యాత్మిక ఆట. సాయి భజన అంతాక్షరి యొక్క విశిష్ట లక్షణాలు ఏమనగా:
- ఈ ఆటలో సాయి భజనలు మాత్రమే పాడాలి.
- వేరే అంతాక్షరీ ఆటలలో ఆడే ప్రామాణిక రౌండ్ మాత్రమే కాకుండా అనేక వినూత్నమైన రౌండ్లు ఈ ఆటలో చేర్చబడ్డాయి.
- ఆట యొక్క ప్రతి రౌండ్ ప్రత్యేకమైన ప్రమాణాన్ని కలిగి ఉంటుంది, ఇది ఆటను మరింత ఆసక్తికరంగాను మరియు సవాలుగాను వుంటుంది.
ఈ విభాగంలో ఆట యొక్క 30 రౌండ్ల వివరణాత్మక వివరణ ఇవ్వబడింది. ప్రతి రౌండ్‌కు ప్రత్యేక ప్రమాణం ఉంటుంది. ప్రతి రౌండ్‌కు నిర్దిష్ట ప్రమాణాన్ని సంతృప్తిపరిచే భజనల ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. దాదాపు 350 భజనలు ఉదాహరణలుగా, నమూనాలుగా వివిధ రౌండ్ల క్రింద జాబితా చేయబడ్డాయి.