వర్తులకార అంటే గుండ్రంగా కూర్చుని ఆడే ఆటలు. చిన్నారులకు వారి శక్తి సరిఅయిన మార్గంలో ఉపయోగించి, తమ ఈడు వారితో కలిసి మెలిసి మాట్లాడుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి.
పిల్లలలోని సిగ్గు, సందేహము, వెనుకంజ వేయుట వంటి లక్షణాలను తగ్గించి సంఘము లో కలసి పోవుట ద్వారా పరిపూర్ణ వికాసము ను పెంపొందిస్తాయి. వారి సంభాషణ తీరును , ఇతరులు మాట్లాడే మాటలు జాగ్రత్తగా వినుట, సమన్వయము, ఇతరులతో కలిసిపోయి పని చేసే శక్తి ని పెంపొందిస్తాయి.
ఎదుటి వారిని గౌరవించుట ద్వారా, జీవితం లో ఎదురయ్యే సందర్భాలకు అవసరమైన ప్రత్యేక లక్షణాలు అలవాడతాయి. ఒకళ్ళ తర్వాత ఒకరు ఆడడం లో, ఓర్పు ఇతరులను అర్ధం చేసుకొనుట పెంపొందుతుంది.
వర్తులాకార ఆటలలో బృంద సభ్యులతో దగ్గరితనం పెంపొందుతుంది. గురువు పర్యవేక్షణ సులభతరమౌతుంది. Musical Chairs లాంటి ఆటలు ఒక రీతిని, వరుసను ఖచ్చితంగా అనుసరించేలా చేసి ఆనందం కలిగిస్తాయి. అందరం ఒక్కటే అనే భావం వృద్ధి పొందుతుంది.
ఈ విధంగా వర్తులాకార ఆటలు, విసుగు చెందించే రోజు వారీ జీవితం లో ఉత్సాహాన్ని నింపుతాయి.