ఐదు ఇంద్రియములు – గైడెడ్ విజువలైజేషన్
మనకు తెలుసు మనము నిశ్శబ్దముగా కూర్చుని ధ్యానము చేయాలని అనుకున్న వెంటనే లెక్కలేనన్ని ఆలోచనలు మన మనస్సులో మెదులుతాయి. ఈ ఆలోచనల వలన మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మన కోరికలను కానీ సంబంధ బాంధవ్యములను కానీ తెలుపవు. కానీ మనసును కల్లోలపరచి ఆటంకములను కలుగచేస్తాయి / ప్రతిబంధకములుగా పనిచేస్తాయి. అనవసరమైన ఆలోచనలో విలువైన సమయం నిరుపయోగంగా పోతుంది; ఇది భయంకరమైన వ్యర్థం అని మాకు తెలుసు. నివారణ ఏమిటి? అనవసరమైనటువంటి ఆలోచనలతో కాలము / సమయము వృధా అవుతుంది. ఇది విపరీతమైన పరిణామము. మరి దీనికి నివారణ ఏమిటి ?
బాబా ఇలా అన్నారు: “ఆలోచన అనే విత్తనాన్ని నాటండి-క్రియ అనే ఫలాన్ని పొందండి, క్రియ అనే విత్తనాన్ని నాటండి -అలవాటు అనే ఫలాన్ని పొందండి. అలవాటు అనే విత్తనాన్ని నాటండి -గుణము అనే ఫలాన్ని పొందండి, గుణము అనే విత్తనాన్ని నాటండి – అదృష్టమనే భాగ్య ఫలమును పొందండి”.
మన ఆలోచనలను నియంత్రించి సన్మార్గమునకు మార్గదర్శకము వహించు మహా వాక్యము. దీనిని సాధించుటకు అనేక మార్గములు ఉన్నాయి. మన ప్రభువు సూచించిన తొమ్మిది పాయింట్ల సూత్రముల ప్రవర్తనా నియమావళి “రోజువారీ ధ్యానం మరియు ప్రార్థనలు చాలా అవసరం ” నిత్య ప్రార్ధన ధ్యానము యొక్క ఆవశ్యకత అవసరము వివరిస్తుంది అని ఉటంకించింది.
మనస్సు యొక్క మొదటి లక్షణాన్ని అర్థం చేసుకోండి. ఇది ఇంద్రియముల వెంట పరిగెడుతుంది / ఇంద్రియములను అనుసరిస్తుంది. ఉదాహరణకు, ఒక కుండ నీరు ఖాళీ అయినప్పుడు, అది పది రంధ్రాల ద్వారా నీరు కారిపోనవసరము లేదు మనం ఊహించనవసరం లేదు, దానిని ఖాళీ చేయడానికి ఒక రంధ్రము సరిపోతుంది. అదే విధముగా ఏ ఒక్క ఇంద్రియము ఆధీనములో లేనిచో మనము బంధములకు లోనై ఉంటాము. ప్రతి ఒక్క ఇంద్రియమును స్వాధీనములో ఉంచుకోవలెను.
ప్రదర్శన