పరిచయం
ఆంగ్లంలో రిలీజియన్ అనే పదం ‘రీ లిగేర్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఒక మూలానికి కట్టుబడటం. అదే భగవంతుడు ఎలాగైతే ఆడుకుంటున్న పిల్లవాడు తిరిగి తన తల్లి దగ్గరికి భద్రత మరియు, రక్షణ కోసం వెళ్తాడో అలాగే మానవుడు తన అంతఃకరణ లో బలమైన కోరికతో దేవునితో వారి దయ రక్షణ ప్రేమ కోసం అనుసంధానం కోరుతాడు. మతం అనగా దైవత్వ రక్షణపై నమ్మకం. దైవ శాసనం మరియు నైతిక ప్రవర్తనపై ఆధారపడి మంచిగా జీవించడం, మంచినే చేయటం మంచిని చూడటం అలవరుస్తుంది. మతం విశ్వాన్ని సంయమనంతో కలిపి ఉంచేలా సహకరిస్తుంది.అన్ని మతాలు భగవంతునికి మనిషి ని కలిపే వారధి వంటివి.అన్ని మతాలు వేటికవే భగవంతుని వర్ణిస్తాయి. కానీ ఒకే పరమాత్మ అన్ని మతాలకు లక్ష్యంగా ఉంటాడు.
సర్వధర్మ ఐక్యత
శక్తినిచ్చేది మతం అంటారు స్వామి. అన్ని మతాల లక్ష్యం వ్యక్తి తన బుద్ధిని నియంత్రించుకుని,విముక్తి కలిగించుకోవడం అందరూ తమ తమ బుద్ధిని వశం చేసుకొని సరియైన ఆలోచనా విధానంతో, సమాజంలో శాంతిని నెలకొల్పటం. ఏ మతం వారు మరో మతాన్ని విమర్శించరాదు.ఉన్నది ఒకటే మతం అనేది ఎప్పుడూ మరువరాదు.అదే ప్రేమ మతం ఉన్నది ఒకటే కులం అది మానవ కులం.
సాయి మతం
మత స్థాపకులు మత ప్రవక్త ల లక్ష్యం ఒకటే.అదే అందరూ ప్రచారం చేస్తారు అందరి కోరిక మంచినే చేయాలి మంచినే చూడాలి మంచిగా ఉండాలి. ప్రజలను సమాజానికి సహాయకారులుగా మార్చడం వారి సందేశం. దీనికోసం మనసును ప్రక్షాళన కావించడం, నియంత్రణలో నిలపడం సరైన మార్గంలో నిర్దేశించటం అవసరము.
బాబా వారి దివ్య వాణి
- సత్పురుషులు సాధువుల మత బోధనలను ఆచరణలో పెట్టాలి.
- సహజీవన కేంద్రంగా మార్చేందుకు మన కుటుంబ సభ్యులను ప్రేమించాలి.
- భగవంతుని, మనిషి యొక్క సోదర త్వాన్ని బలంగా నమ్మాలి.
- మన హృదయం నుంచి అహంకారం ఈర్ష ద్వేషాన్ని తొలగించాలి.
- అచంచలమైన విశ్వాసాన్ని కలిగి అనంత శక్తిని సహనంతో వీక్షించాలి.
మన మత విశ్వాసాన్నిఆచరిస్తూ,అభివృద్ధి చేస్తూ ఇతర మతాలను గౌరవించాలి. ఇదే సాయి మతం. పరమత సహనాన్ని కలిగి ఉండటం, అన్ని మతాల ప్రాముఖ్యతను అంగీకరించడం ద్వారా ఈ సాయి మత సందేశాన్ని ఆనందంగా పెద్ద మనసుతో స్వీకరించాలి.