స్వామి మన శ్వాసపై దృష్టి పెట్టడానికి “సో-హమ్” ధ్యాన పద్ధతిని అందించారు. ఈ పద్ధతిని ఈ క్రింది తెలిపిన విధంగా పాటించాలి:
కళ్ళు సగం తెరిచి ఉంచి, ముక్కు కొనపై చివర దృష్టి పెట్టండి నిలపాలి. కుడి చేయి బొటన వేలితో కుడి వైపు ముక్కును మూసి/బంధించి, ఎడమ వైపు నుండి శ్వాసను లోపలికి తీసుకోవాలి. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు “సో” అని పలకాలి. ఇప్పుడు ఎడమవైపు ముక్కును మూసి కుడి వైపు నుండి శ్వాసను బయటకి నెమ్మదిగా వదలాలి. ఈ నిశ్వాస సమయంలో “హమ్” అని ఉచ్చరించాలి. ఈ విధముగా ఉచ్వాసన నిశ్వాస ప్రక్రియ సలపాలి. సావధానముగా తెలివితో “సో-హం” (సో[అది, దైవము]-నేనే) తత్వమును/అంతరార్ధమును తెలుసుకొని హృదయస్థము అయ్యేట్లుగా సాధన చేయవలెను. మనస్సును ఉచ్ఛ్వాసనిశ్వాసములకు కాపలాదారునిగా నియమించి అంతర్ చెవితో/అంతర్వాణితో సోహం (శబ్దము)ను వినవలెను. “సో-హం” అనే ఈ వేదవాక్యము, దివ్యత్వము నీలోనే ఉన్నది, దైవముతో నీవు వేరు కాదు – అన్న సత్యసారాంశమును బోధపరుస్తుంది. పాఠ్యాంశాలు ఖాళీగా ఉన్నాయి