గేయం గీతా నామ సహస్రం

ఆడియో
సాహిత్యం
- గేయం గీతా నామ సహస్రం,
- ధ్యేయం శ్రీపతి రూప మజస్రం |
- నేయం సజ్జన సంగే చిత్తం ,
- దేయం ధీన జనాయ చ విత్తం||
భావము :
భగవద్గీత, విష్ణు సహస్రనామము మొదలైన పవిత్ర గ్రంధముల పారాయణము ఆధ్యాత్మిక సాధనలో ప్రధానము.
గీతా గానము, నామకుసుమములతో హరి స్మరణము, నిత్యము శ్రీహరి అర్చనము, సజ్జనులతో స్నేహము, దీనజనులకై దానము. ఈ పవిత్ర కర్మలను ప్రతినిత్యం ఆచరించాలి.

వివరణ
| గేయం | గానము |
|---|---|
| గీత | భగవద్గీత |
| నామ | నామము, |
| సహస్ర | వేయి |
| ధ్యేయం | ధ్యానం |
| శ్రీపతి | భగవంతుని |
| రూప | రూపమును |
| జస్రం | ఎల్లప్పుడూ |
| నేయం | నడపదగినది |
| సజ్జన | సాధు జనులు |
| సంగే | సాంగత్యము |
| చిత్తం | మనస్సు |
| దేయం | ఇవ్వదగినది |
| ధీన జనాయ చ | దీన జనులకొరకు |
| విత్తం | ధనమును |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty



















