భగవంతుని ఆశీర్వాదం చేత భారతదేశంలో అనేక రంగాలలో పేరుగాంచిన ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. వారు ప్రతి వ్యక్తిలో చైతన్యాన్ని పెంపొందించడం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. యుగ యుగాలుగా భారతదేశ నేపథ్యంలో ఇది స్థిరమైన అంశంగా నిలిచిపోయింది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత లక్ష్యాలను సాధిస్తే సరిపోదు. తిరిగి సమాజ శ్రేయస్సుకై దృష్టి సారించాలి. మన జీవితాలు మంచు గడ్డ వంటివని స్వామి చెప్పారు. అది కరిగిపోయే లోపల జీవితం ఇతరుల సేవకై అంకితం కావాలి. రామకృష్ణ పరమహంస, వివేకానంద మరియు మహాత్మా గాంధీ వంటి వారి గొప్పదనం నుండి నేర్చుకోవలసిన పాఠాలను స్వామి అనేక సందర్భాలలో చెప్పారు. ఈ మహనీయులు ఎటువంటి జీవితాన్ని గడిపారో విద్యార్థులు తెలుసుకోవాలి మరియు వారు ఆచరించి బోధించిన విలువలను అభ్యసించడానికి ప్రయత్నించాలి.
మహనీయుల జీవిత చరిత్రలు
