వ్యాస భగవానుల ఆదేశానుసారం విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని వ్రాసాడు, ఇది హస్తినాపుర సింహాసనం కొరకై దాయాదులైన కౌరవ పాండవులు జరిపిన పోరాటము. హిందూమతంలోని రెండు ఇతిహాసాలలో ఇది ఒకటి. ఇందులోని ప్రతి ప్రధానమైన పాత్ర, వారి ప్రవర్తన మనకు అనేక పాఠాలను బోధిస్తుంది. వాటిలో ‘ధర్మాన్ని’ మన జీవితంలో ఆచరించే ప్రధానమైన గుణంగా ఎంచుకోవాలని స్వామి సూచించారు. ఇదియే మన జీవితానికి ప్రధానమైన సూత్రము. మరియు మనం ధర్మాన్ని ఆచరిస్తే మనకు అంతా శుభమే జరుగుతుంది.
పిల్లల అవగాహనా స్థాయిని పరిగణనలోకి తీసుకొని మహాభారతంలోని కథలను వారికి బోధించవచ్చు. మహాభారతంలో అనేక చిన్న కథలు కూడా ఉన్నాయి. కొన్ని ధైర్యం, భక్తి, ప్రేమ, దయ వంటి విలువలతో కూడిన కథలను పాఠాలుగా చెప్పవచ్చు.