మన్మనా భవ

ఆడియో
శ్లోకం
- మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
- మామే వైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః ||
భావము
నాయందే మనస్సు కలవాడవును, నా భక్తుడగును, నన్నే పూజించు వాడవును అగుము. నాకే నమస్కరింపుము. ఈ ప్రకారముగా మనస్సును (చిత్తమును) నా యందే నిలిపి, నన్నే పరమగతిగా ఎన్నుకొన్నవాడవై తుదకు నన్నే పొందగలవు.

వివరణ
| మన్మనా | నా యందే మనస్సు కల వాడవు |
|---|---|
| మద్భక్త: | నా భక్తుడవును |
| మద్యాజీ | నన్నే పూజించువాడవు |
| భవ | అగుము |
| మామ్ | నన్నే |
| నమస్కురు | నమస్కరింపుము |
| ఏవమ్ | ఈ రీతిగా |
| ఆత్మానం | మనస్సును |
| యుక్త్వా | నా యందే నిలిపి |
| మత్పరాయణః | నన్నే పరమగతిగా ఎన్నుకొనిన వాడవై |
| మామ్ ఏవ | నన్నే |
| ఏష్యసి | పొందగలవు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి


















