యోగరతో వా భోగరతో వా
ఆడియో
సాహిత్యం
- యోగరతో వా భోగరతో వా
- సంగరతో వా సంగవిహీనః |
- యస్య బ్రహ్మణి రమతే చిత్తం
- నందతి నందతి నందత్యేవ ||
భావము :
యోగిగా నిరాడంబరమైన జీవితాన్ని అవలంబించినను, భోగివలె సుఖమయ జీవితాన్ని చేపట్టిననూ, సంసారియై బంధుజనులతో చేరి యున్ననూ, సన్యసించి ప్రాపంచిక విషయ వాసనలకు దూరముగా జీవనం సాగించుచున్ననూ, ఆనందం మానవులకు ఎప్పుడు లభిస్తుంది? హృదయం ఎల్లప్పుడూ బ్రహ్మమునందే రమిస్తూ ఉన్నప్పుడు మానవులకు ఆనందం లభించును.
వివరణ
యోగరతః | యోగమువలన సంతోషపడువాడు |
---|---|
వా | లేక |
భోగరతః | భోగమువలన సంతోషపడువాడు |
సఙ్గరతః | సంఘములో ఉండి సంతోషంగా వుండేవాడు |
సఙ్గవిహీనః | సంగత్వము లేకుండా ఉండడము వలన సంతోషపడువాడు |
యస్య | ఎవని యొక్క |
బ్రహ్మణి | బ్రహ్మ పదార్థమునందు |
రమతే | రమించునో |
చిత్తం | మనసు |
నన్దతి | ఆనందించుచున్నాడు |
నన్దత్యేవ | అతడు మాత్రమే ఆనందిస్తాడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty