జై జై దుర్గే జై భవానీ
ఆడియో
సాహిత్యం
- జై జై దుర్గే జై భవానీ
- శాంభవి శంకరి జై భవానీ
- జయ జగదంబే జయ మాంగళ్యే
- శాంభవి శంకరి జై భవానీ
- జయ జగజననీ మహాకాళికే
- శాంభవి శంకరి జై భవానీ
భావము
దుఃఖములను నివారించి, భవసాగర బంధనాలను దాటింపచేసి, శుభములను, మంగళములను కలిగించే కాల స్వరూపిణి, లయ కారిణి అయిన జగన్మాతకు జయము జయము.
వివరణ
వివరణ
జై జై | జయము, జయము |
---|---|
దుర్గే | దుర్గతి నాశిని, దుఃఖనాశిని |
భవానీ | ‘భవము’ అనగా సంసారము. సంసార బంధనాలను దాటింప చేసేది. ‘భవ’ అనగా శంకరుడు. శంకరుని పత్ని. |
శాంభవి | శుభములను చేకూర్చేది. శంభుని రాణి. |
శంకరి | మంగళమును కలిగించేది. శంకరుని పత్ని. |
జగదంబే | జగత్తునకు మాత. |
మాంగళ్యే | శుభములు చేకూర్చునది. |
జగజననీ | జగత్తునకు తల్లి. (పిపీలికాది -బ్రహ్మ పర్యంతము జగన్మాత పిల్లలే) |
మహాకాళికే | కాల స్వరూపిణి. లయ కారిణి. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty