దినయామిన్యౌ

ఆడియో
సాహిత్యం
- దినయామిన్యౌ సాయం ప్రాతః
- శిశిర వసంతౌ పునరాయాతః |
- కాలఃక్రీడతి గచ్ఛత్యాయుః
- తదపిన ముంచత్యాశా వాయుః ||
భావము :
దివారాత్రములు, ఉదయ సాయంత్రములు, శిశిర వసంతాలు ఒకదాని నొకటి అనుసరించి కాలగమనంలో పునరావృతమవుతుంటాయి. కాలం ఆగదు. పరుగులు తీస్తూనే ఉంటుంది. వ్యర్థమయిన దినచర్యలో కాయం క్షీణిస్తూ వుంటే, ఒకవైపు మానవుని ఆయువు తరగిపోతూ ఉంటుంది. అయినా సరే – మానవునిలో ఆశాపాశము మాత్రం నిలిచిఉంటుంది.

వివరణ
| దినయామిన్యౌ | పగలు రాత్రి |
|---|---|
| సాయం | సాయంత్రము |
| ప్రాతః | ఉదయము |
| శిశిర వసంతౌ | శిశిర వసంత కాలము |
| పునః | తిరిగి |
| ఆయాతః | వస్తుంటాయి |
| కాలః క్రీడతి : | కాలము వినోదంగా |
| గచ్ఛతి | వెళ్ళి పోతుంటుంది |
| ఆయః | జీవితకాలము |
| తత్ | ఈ విషయము |
| అపి | తెలిసినప్పటికీ |
| న ముంచతి | వదలుట లేదు |
| ఆశా వాయుః | ఆశాపాశములు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
కార్యాచరణ





















